Header Banner

మరోసారి కరోనా కలకలం! వారం వ్యవధిలోనే వేల కేసులు నమోదు!

  Fri May 16, 2025 07:49        Others

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ తన పంజా విసురుతోందా? హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఇటీవల వెలుగుచూస్తున్న కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ మహమ్మారితో పాటు, అడినో వైరస్, రైనో వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

హాంకాంగ్‌లో 17 నెలలు, 13 నెలల వంటి పసి పిల్లలకు సైతం కోవిడ్ సోకుతుండటం భయాన్ని కలిగిస్తోంది. ఈ నెల 3న తొలి కేసు నమోదవగా, కేవలం వారం రోజుల్లోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సింగపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వారం వ్యవధిలోనే 14,200 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రెండు దేశాలు తిరిగి మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.


ఇది కూడా చదవండిఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

కోవిడ్, అడినో, రైనో వైరస్‌ల వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి గల కారణాలు, తాజా పరిస్థితులపై ఆరా తీస్తోంది. ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధిక జనసమూహం ఉండే ప్రాంతాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హాంకాంగ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో తెలిపారు. ప్రముఖ హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడటంతో, తైవాన్‌లోని కావోసియుంగ్‌లో జరగాల్సిన ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CoronaAlert #COVID19 #CoronaScare #StaySafe #HealthUpdate #VirusOutbreak #COVIDSpike #PublicHealth #CoronaCases #PandemicUpdate